Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్‌లోని శాంతినగర్‌లో ఫిరోజ్, హాజిల్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్నేండ్ల నుంచి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. కల్తీ అల్లం పేస్ట్, మాంగో డ్రింక్ తయారు చేస్తున్నారు. ఈ కల్తీ అల్లం పేస్ట్‌లో ప్రమాదకర ఎసిటిక్ యాసిడ్‌ను ఉపయోగిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ పరిశ్రమలపై ఎస్ఓటీ దాడులు నిర్వహించగా పెద్ద ఎత్తున కల్తీ అల్లం పేస్ట్ లభ్యమైంది. ఫిరోజ్, హాజిల్ అదుపులోకి తీసుకొని విచారించగా కల్తీ వ్యాపారం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. వీరిద్దరిని అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.