Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు సరూర్‌నగర్ స్డేడియంలో యూత్ డిక్లరేషన్‌పై ప్రియాంకగాంధీ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ తలపెట్టిన యువ సంఘర్షణ సభను సోమవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్డేడియం లో నిర్వహించనున్న ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ హాజరుకానున్నా రు. ఈ సంద ర్భంగా యూత్ డిక్ల రేషన్ పేరుతో నిరుద్యోగులకు భరోసా పత్రాన్ని విడుదల చేయను న్నారు. ప్రియాంక తొలిసారి రాష్ట్రానికి రానుండటంతో పార్టీ ఆ సంఘర్షణ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ఇంచార్జి లను నియమించి భారీ జనసమీ కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రియాంకగాంధీ తొలుత ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. అనంతరం యువ సంఘర్షణ సభలో ప్రసంగిస్తారు. వివిధ కారణాలతో మరణించిన పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కల్పించిన బీమా సౌకర్యాన్ని బాధితులకు అందించనున్నారు.