Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకాల వర్షాలతో రాష్ట్రంలో చేతికొచ్చిన పంట నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి అందరూ సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చేసే కృషికి బాధ్యత గల మిల్లర్లుగా రైస్ మిల్లింగ్ పరిశ్రమ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర మిల్లర్ల సంఘం ప్రతినిధులు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ధాన్యం అన్లోడింగ్ సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఆ రెండు జిల్లాల్లో ఎటి ్టపరిస్థితుల్లోనూ కొనుగోలు కేంద్రం నుంచి పంపిన ధాన్యాన్ని దింపుకోవాలని ఆదేశించారు. పదే పదే తడిచిన ధాన్యం మిల్లింగుకు పనికి రాకుండా పాడవుతుందనీ, నూక శాతం పెరగడంతో పాటు రంగుమారుతుందనీ, అలాంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆమోదించకపోవడంతో నష్టం జరుగుతున్నదని తెలిపారు. కనీస నాణ్యతా ప్రమాణాలను సడలిం చాలంటూ ఎఫ్ సీఐకు లేఖ రాశామనీ, మరోసారి దీన్ని ఆమోదించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రూ.3,161 కోట్ల విలువైన 15.38లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 6,087 కొనుగోలు కేంద్రాల ద్వారా ఒక లక్షా 7 వేల మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే లు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ చైర్మెన్ రవీందర్ సింగ్, కమిషనర్ వి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు
మంత్రి గంగుల తనజన్మదినాన్ని పురస్కరించు కుని సచివాలయంలో సీఎం కేసీఆర్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం గంగులను ఆశీర్వదించి, అభినందించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.