Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయెల్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో వైద్యుల సాక్ష్యాలు అత్యంత కీలకమవుతున్నాయని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షిఖా గోయెల్ అన్నారు. మెడికో లీగల్ కేసుకు సంబంధించి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుంచి రెండ్రోజుల పాటు జరుగుతున్న రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను షిఖా గోయెల్ డీజీపీ కార్యాలయంలో ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు జరుగుతున్న సందర్భంలో వాటిని మెడికో లీగల్ కేసులుగా తీసుకొని బాధితురాళ్లకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదదని అన్నారు. అలాగే కొన్ని కేసుల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో కూడా నిపుణులు పరీక్షలను నిర్వహించడం జరుగుతున్నదని ఆమె తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేసే అత్యంత సున్నితమైన ఇలాంటి కేసులలో సాక్ష్యాలు సేకరించి నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడేలా చేయడం దర్యాప్తు అధికారులకు ఒక సవాలుగా పరిణమిస్తున్నదని షిఖా గోయెల్ అన్నారు. ముఖ్యంగా, కోర్టులలో నిజాలు తేల్చి నిందితులకు శిక్షలు పడేలా చేయడానికి వైద్యులు జరిపే పరీక్షలు, వాటి ఆధారంగా కోర్టులలో ఇచ్చే సాక్షాలు కూడా అత్యంత కీలకమవుతున్నాయని ఆమె తెలిపారు. ఈ రెండ్రోజుల వర్క్‌షాప్‌లలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన 78 మంది సీనియర్ వైద్యులు పాల్గొంటున్నారని షిఖా గోయెల్ తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో నగరంతో పాటు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొన్నారు.