Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ప్రధాని మోడీ ''జై భజరంగ బలి'' అంటూ నినాదాలు ఇచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాంటి నినా దాలు ప్రధాన మంత్రి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశంలో రకరకాల పుకార్లనూ, ప్రచారాన్ని నమ్మొద్దనీ, ముందు స్థానిక సమస్యల పరిష్కారం కోసం దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకొస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్షా ప్రకటించడంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లు నివేదికలిచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక కారణాలను చూపుతూ సీపీిఐకి జాతీయ హోదాను ఉపసంహరించడం పట్ల అసంతృపిన్తి వ్యక్తం చేశారు. దామాషా పద్దతిన ఎన్నికలు జరిగితే ఫలితాలు మరోరకంగా ఉంటాయని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద వర్గాలకు అనేక కోతలు విధించిందని విమర్శించారు. నరేగా, ఆహార సబ్సిడీ, ఎరు వుల నిధులకు కోత పెట్టిందన్నారు. హిందూ,ముస్లిం ,భారత్, పాకిస్తాన్ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టటం సిగ్గుచేటన్నారు.రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఫాసిస్టు అవశేషాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 'ఇంటింటికీ సీపీఐ' పాదయాత్రలో పార్టీ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను క్రోడీకరించి, వాటి పరిష్కారానికి భవిష్యత్లో పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ , రైతుల రుణమాఫీ, పోడు భూములు, ఇండ్ల స్థలాలు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు, వీఓఏ, విద్యుత్ రంగంలోని ఆర్టిజన్, సింగరేణి ఇలా అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి కూడా పాల్గొన్నారు.