Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆన్లైన్లో నిర్వహించిన రాతపరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నిర్వహించిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ సబ్జెక్టులకు 21,472 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 17,717 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 11,102 (51.7 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్చాయరని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించిన పేపర్-2 పరీక్షను 11,028 (51.4 శాతం) మంది రాశారని తెలిపారు. 163 పోస్టుల భర్తీ కోసం గతేడాది సెప్టెంబర్ మూడో తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష నిర్వహణ కోసం 16 జిల్లాల్లో 78 కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంగళవారం అగ్రికల్చర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టులకు ఆన్లైన్లో, సివిల్ ఇంజినీరింగ్‌కు ఓఎంఆర్ ఆధారిత పరీక్షను ఈనెల 21వ తేదీన రాతపరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది.