Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫలితాలను హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో మంగళవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మార్చి 15 నుంచి గతనెల నాలుగో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 24వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు ఫలితాలను https://tsbie.cgg.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్సైట్లను సంప్రదించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు