Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (వీఐటీఈఈఈ) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశంలోని 121 నగరాలు, నాలుగు ఇతర దేశాల్లోని నగరాల్లో గతనెల 17 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించారు. జార్కండ్‌కు చెందిన కుషగ్ర బాషిస్త్ ప్రథమ ర్యాంకు పొందారు. మహారాష్ట్రకు చెందిన ప్రక్షాల్ శ్రీనివాస్ చౌదరి రెండో ర్యాంకు, మహిన్ ప్రమోద్ ధోకే మూడో ర్యాంకు సాధించారు. కేరళకు చెందిన ఆషిక్ స్టెన్నీ నాలుగో ర్యాంకు, బీహార్‌కు చెందిన అంకిత్‌కుమార్ ఐదో ర్యాంకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నంద్యాల ప్రిన్స్ బ్రన్హన్రెడ్డి ఆరో ర్యాంకు, బీహార్‌కు చెందిన ఎండీ ఉమర్ ఫైసల్ ఏడో ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన అన్షుల్ సందీప్ నఫడే ఎనిమిదో ర్యాంకు, హర్యానాకు చెందిన రిషిత్ గుప్తాకు తొమ్మిదో ర్యాంకు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన తన్మరు బఘేల్ పదో ర్యాంకు పొందారు.ఈ ప్రవేశ పరీక్షలో లక్షలోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థులు బీటెక్ ఇంజినీరింగ్‌లో చేరేందుకు అర్హులుగా ఉంటారు. వచ్చేనెల 14వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ను ప్రక్రియను నిర్వహిస్తారు. లక్షపైన ర్యాంకు వచ్చిన అభ్యర్థులు వీఐటీ ఏపీ, వీఐటీ భోపాల్ ప్రాంగణాల్లో చేరేందుకు అర్హులుగా ఉంటారు. వారి కోసం ఐదో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను వచ్చేనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒకటి నుంచి పది ర్యాంకులు పొందిన వారికి వంద శాతం ట్యూషన్ ఫీజు నాలుగేండ్ల వరకు మినహాయింపు ఉంటుంది. 11 నుంచి 50వ ర్యాంకు వరకు ట్యూషన్ ఫీజులో 75 శాతం మినహాయింపు వర్తిస్తుంది. 51 నుంచి వంద ర్యాంకు వరకు ట్యూషన్ ఫీజులో 50 శాతం, 101 నుంచి 500 ర్యాంకుల వరకు ట్యూషన్ ఫీజులో 25 శాతం మినహాయింపు ఉంటుంది. సపోర్ట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్ (స్టార్స్) పథకం కింద తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లలో చదివి జిల్లా టాపర్లుగా నిలిచిన ఒక అబ్బాయి, అమ్మాయికి వంద శాతం ట్యూషన్ ఫీజుతోపాటు హాస్టల్, మెస్ ఫీజులోనూ మినహాయింపు వర్తించనుంది.