Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి అమల్లోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ టిక్కెట్‌తో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించవచ్చు. సాధారణ ప్రయాణికులకు ఈ టిక్కట్ ధర రూ.90కాగా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల నిర్ణయించారు. అలాగే మంగళవారం నుంచి మహిళా ప్రయాణికులకు కూడా రూ.80కే ఈ టిక్కెట్ అందిస్తారు. అన్ని సిటీ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. టీ-24 టిక్కట్ ధరల తగ్గింపు తర్వాత రోజుకు సగటున 40 వేల వరకు ఈ అమ్ముడవుతున్నాయని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గతంలో ఈ టిక్కెట్లు రోజుకి 25 వేలు మాత్రమే అమ్ము డయ్యేవని చెప్పారు. అలాగే ఇటీ వల కుటుంబ సభ్యులు, స్నేహి తుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ. 300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ఈ టిక్కెట్లపై ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.