Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా మావోయిస్టుతో సహా దళ కమాండర్ మృతి
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దంతేష్ పురం దండకారణ్యంలో సోమవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 8 లక్షల రివార్డు గల ఎల్వోఎస్ కమాండర్ మడకం ఎర్ర, ఎల్వోఎస్ సభ్యురాలు పొడియం భీమా మృతి చెందినట్టు సుకుమా ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. గొల్లపల్లి ఎల్వోఎస్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మడకం ఎర్ర దంతేష్ పురం అడవుల్లో సంచరిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులను చూసి విచక్షణారహితంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు సైతం కాల్పులు జరిపారు. సుమారు గంట పాటు జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఇద్దరు మావోయిస్టులు చనిపోగా సంఘటనా స్థలంలో మావోయిస్టుల దైనందిన సామగ్రితో సహా మందు గుండు సామగ్రిని పెద్ద మొత్తంలో స్వాధీనపర్చుకున్నట్టు ఎస్పీ వివరించారు.