Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ)
- హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బి.కిరణ్మయి డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీవో 38 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో డీఎస్సీ ద్వారా నియమితులై అనేక ఏండ్లుగా పని చేస్తున్న ఉద్యోగులు ఇందులోకి కవర్ కావడం లేదని చెప్పారు. ఈ ప్రక్రియలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వైద్య శాఖలోని ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలను ఎరియర్స్ రూపంలో వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఎ.కవిత, నగర ఉపాధ్యక్షులు పి.లక్ష్మి, నగర కోశాధికారి రాజేశ్వరి, హెచ్ఆర్డీ పద్మ, ఈసీ ఏఎన్ఎం షీలా, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.