Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తడిసిన వడ్లు కొనాలనీ, కోతలు పెట్టొద్దని రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా..సీఎం కేసీఆర్కు పట్టటం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ సర్కార్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఎండనకా, వాననకా రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారని తెలిపారు.
అప్పుల పాలైన రైతన్న రోదిస్తుంటే.. సీఎం కనికరించకపోవటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మిల్లర్లు, వ్యాపారులు క్వింటాలుకు 12 కిలోల తరుగు తీసి, రైతుల పొట్టుకొడుతున్నారని ఆరోపించారు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.బుధవారం అన్ని కొనుగోలు కేంద్రాల ముందు వైఎస్ఆర్టీపీ ఆద్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.