Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భూసార పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. పచ్చి రొట్ట విత్తనాలు 65శాతం సబ్సిడీతో సరఫరా చేస్తున్నదని తెలిపారు. 1445 డీసీఎంస్, పీఎసీఎస్ గుర్తింపబడిన పచ్చిరొట్ట విత్తనాలు అగ్రో రైతు సేవా కేంద్రాల్లో అందుబాటు లో ఉన్నాయని వివరించారు. పచ్చిరొట్ట ఎరువులతో నాణ్యమైన, ఆరోగ్య వంతమైన పంట దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో భూసార పరిరక్షణపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వాడకం ద్వారా నేలల సహజ స్వభావం దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంత్, సీడ్స్ ఎండీ కేశవులు, ఏడీడీ విజరు కుమార్ తదితరులు ఉన్నారు.