Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాంకేతికతతో జీవన విధానంలో మార్పులు
- ఫ్రేమ్‌వర్క్‌లో తెలంగాణే మొదటిది : మంత్రి కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ ఆర్థిక రంగానికి బూస్ట్ వంటిదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని పేర్కొన్నారు. మంగళ వారం హైదరాబాద్‌లో రాయదుర్గంలోని టీహబ్‌లో 'రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్'ను ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్తో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికత మనిషి జీవన విధానంలో మార్పులు తీసు కొస్తున్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ మొబైల్లోనే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఆనందాన్ని పొందుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోబో పార్కు, తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామనీ, జులైలో గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్‌ను నిర్వ హించనున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి రోబోటిక్స్ ఎకోసిస్టమ్‌ను రూపొ ందించనున్నామనీ, రోబోటిక్స్ తయారీలో తెలంగాణను గ్లోబల్హబ్గా మారుస్తామని, రాష్ట్రంలో రోబోటిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రోబోల ఎగుమతులు, దిగుమతులకు మార్గాన్ని సుగమమం చేస్తామని చెప్పారు. ప్రపంచస్థాయి రోబోటిక్స్ టెస్టింగ్ సెంటర్ ను నిర్మించనున్నామని చెప్పారు. వ్యవసాయ రంగం, హెల్త్‌కేర్, పారిశ్రామిక ఆటోమేషన్, వినియోగదారుల రంగాల్లో రోబోటిక్స్ కీలకపాత్ర పోషించను న్నాయని వెల్లడించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందంజలో ఉందనీ, అందులో భాగంగానే 2017లోనే ఎమర్జింగ్ టెక్నా లజీ విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని రంగాల్లో సాంకేతికతనే కీలకంగా మారిందనీ, ఫ్రేమ్‌వర్క్‌లో పాలసీ, పార్టనర్‌షిఫ్, ప్రాజెక్టులు(పీపీపీ)పై కేంద్రీకరించనున్నామని తెలిపారు. పాలసీ ఫ్రేమ్ వర్క్‌లో అర్టిషియల్ ఇంటెలి జెన్స్, క్లౌడ్, బ్లాక్‌చైన్, డ్రోన్, స్పేస్‌టెక్ ఉన్నాయని చెప్పారు. రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ ద్వారా సస్టెయినబుల్ రోబోటిక్స్ ఎకోసిస్టం, ఇన్నోవేషన్, ఎంటర్ప్రిన్యూర్షిఫ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఛాంపి యన్‌గా మారనున్నట్టు తెలిపారు. అంతకుముందు ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్పార్కు, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, అగ్రీ హబ్, పీజేటీఎస్ఏయూ, ఆన్ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్లతో తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఎంఓయూలపై సంతకాలు కూడా చేశారు. అనంతరం ఐటీ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్ తెలంగాణలో అమలు చేస్తున్న ఐటీ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవిలంకా మాట్లాడుతూ రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్ మైలురాయిగా నిలవనుందని అన్నారు.