Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపితే, నోటీసులు ఇచ్చి పోలీసులతో బెదిరింపులకు గురిచేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టీ నాగరాజు ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేదనే విషయాన్ని ఆరునెలల క్రితమే వీసీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేద న్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా క్యాంపస్లో తాగడానికి నీరు కూడా అందుబాటులో లేదన్నారు. క్యాంటీన్, సరైన కంప్యూటర్ ల్యాబ్ లేవన్నారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారనే నెపంతో అర్ధంతరంగా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.