Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతరావు హెచ్చరిక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పశుసంవర్ధక శాఖ బాధ్యతలు నిర్వహిస్తూ...పశువులా మాట్లాడకు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు సునీతారావు హెచ్చరించారు. టీడీపీలో ఉండి ఆయన ప్రజలకు ఏం చేశారోఅందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబా ద్‌లోని గాంధీభవన్‌లో సునీతారావు విలేకర్లతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని హెచ్చరించారు. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదని చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకొస్తాయని హెచ్చరించారు.