Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు ప్రవీణ్‌కుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ గడీని వీడి రైతుల సమస్యలను పట్టించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్నదాతలను పట్టించుకునే వారు లేకపోవటంతో వారు రోడ్లపైకొచ్చి పోలీసు అధికారుల కాళ్లు మొక్కుతున్నారని తెలిపారు. 'అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్' అంటే ఇదేనా అని ప్రశ్నించారు.అకాల వర్షాల వల్ల ధాన్యం పాడైపోతే ప్రభుత్వం నుండి రైతులకు లభించిన సహకారం ఏమీ లేదని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదనీ, అధికంగా క్వింటాల్‌కి 11 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భార్యాపిల్లలను వదిలి మార్కెట్ లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారనీ, వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు.జూనియర్ పంచాయితీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తుంటే ప్రభుత్వం బెదిరించి పని చేయించుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఆర్టిజన్లు, విఆర్ఏలు,అంగన్ వాడీల విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తుచేశారు.