Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జోన్ సరుకు రవాణాలో రికార్డులను అధిగమించిందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఏప్రిల్ నెలలో రైల్వే ప్రయాణీకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఏప్రిల్ నెలలో ప్రయాణీకుల రవాణా ద్వారా రూ. 465.38 కోట్లు గడించామని మంగళవారంనాటి ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ పెంపుదల 27 శాతం ఉందన్నారు. అలాగే సరుకు రవాణాలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 11.298 మెట్రిక్ టన్నులు లోడింగ్ చేసి, రూ.1,105.79 కోట్ల ఆదాయాన్ని గడించామన్నారు.
సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లకు కూడా ప్రయాణీకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణీకుల రద్దీని తీర్చడానికి 65 ప్రత్యేక రైళ్లు 464 ట్రిప్పులు నడిచి, అదనంగా 3.39 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే ఉద్యోగుల అంకితభావ సేవల్ని కొనియాడారు. ఇదే తరహా ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు.