Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీలో తెలంగాణ-పిలావో నినాదంతో కేసీఆర్ పాలన : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'ఖేలో ఇండియా- జీతో ఇండియా' నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదనీ, రాష్ట్రంలోనేమో సీఎం కేసీఆర్ 'పీలో తెలంగాణ-పిలావో తెలంగాణ' నినాదంతో మద్యాన్ని ఏరులై పారిస్తూ క్రీడలను విస్మరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఛాదర్‌ఘాట్ లో 'ఖేలో భారత్-జీతో భాగ్యనగర్' పేరిట క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. జాతీయ ఓబీసీ కమిషన్ చైర్మెన్ హన్స్‌రాజ్ అహిర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ శంకర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌లతో కలిసి ఆయన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ..విద్యార్థులకు చదువు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆటలకు కూడా అంతే ఇవ్వాలని సూచించారు.
ప్రధాని మోడీ క్రీడల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా పక్కకుపెట్టారన్నారు. పేద, ధనిక, అధికారం అనే తేడా లేకుండా నైపుణ్యమే తొలి మెట్టుగా తీసుకుని క్రీడాకారుల ఎంపిక జరిగేలా చేశారని తెలిపారు. యూపీఏ హయాంలో క్రీడా రంగ బడ్జెట్ రూ.466 కోట్ల రూపాయలుంటే.. 2023-24 కేంద్ర బడ్జెట్లో రూ.3 వేల 397 కోట్లు కేటాయించారని వివరించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.