Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని యువతరం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీలకు చెందిన పలువురు యువకులు స్వచ్చందంగా వచ్చి, మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు భావోద్వేగాలతో తాము బీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నామో చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్నదనీ, దాన్ని తాము కళ్లారా చూస్తూ కూడా మరో పార్టీల జెండాలు మోయడం సరికాదని భావిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ నీచ, అవినీతి రాజకీయాలకు..అభివద్ధికి మధ్య జరిగే పోరాటంలో యువత అభివద్ధి వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.
బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో యువకులు బీఆర్ఎస్లో చేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, ఎంపీపీ డాక్టర్ మధుశేఖర్, వైస్ ఎంపీపీ సురేష్, సర్పంచ్ లింబాద్రి, రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ అశోక్, తలారి ప్రభాకర్, మోర్తాడ్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.