Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నతాధికారులకు ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయా విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఉత్తర్వులను విభాగాల అధిపతులు జిల్లా అధికారులకు జారీ చేశారు. ఇటీవల వైద్యారోగ్యశాఖలో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావులకు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్ఇ యూ) గౌరవాధ్యక్షులు భూపాల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నాయకులు మోహన్ రెడ్డి, అరుణ, సత్య, ఏఎన్ఎంల నాయకురాలు రాజేశ్వరి, నిర్మలతో ఉద్యోగులు, సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. తదితరులు అధికారులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శ్వేతా మహంతి, డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు అఢిషనల్ డైరెక్టర్ విజయను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా జిల్లాలకు ఉత్తర్వులు పొందిన వారిలో ఆస్పత్రుల్లో పని చేసే 60 మందిల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, 68 మంది ఏఎన్ఎంలున్నారు.
వైద్యారోగ్యశాఖలో రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, హెల్త్ అసిస్టెంట్ (మేల్), ఇతర టెక్నీషియన్లు, ఆయూష్ విభాగంలోని ఉద్యోగులున్నారు.