Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన మంత్రి గంగుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి తమ సత్తాను చాటారని మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. వందల సంఖ్యలో విద్యార్థులు పదిలోపు ర్యాంకులు సాధించి ఫలితాల్లో ప్రభంజనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. వారిని అభినందిస్తున్నట్టు తెలిపారు. సకల సౌకర్యాలతో ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో బీసీ బిడ్డలకు అందించిన విద్య వల్లనే ఈ ఫలితాలొచ్చాయని తెలిపారు.