Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలసానిపై మల్లు రవి ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గాంధీ కుటుంబంపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఖండించారు. సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీపై తలసాని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తలసాని తలబిరుసు తనానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.