Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 27 మంది అరెస్ట్
- నలుగురు నిందితులను కస్టడీకి తీసుకోనున్న సిట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో మంగళవారం సిట్ మరో నలుగురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడైన ప్రవీణ్ నుంచి ఏఈ, ఏఈఈ పరీక్ష పత్రాలను ఖరీదు చేసిన ఇద్దరు దళారుల ద్వారా ఈ నలుగురు ప్రశ్నాపత్రాన్ని కొన్నారు. దళారులుగా వ్యవహరించిన వరంగల్‌కు చెందిన మనోజ్‌కుమార్‌రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన మురళీధర్‌రెడ్డిని సోమవారం సిట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రశ్నాపత్రాలను ఏడుగురికి అమ్మినట్టు వెల్లడించారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకొని, అడ్వాన్స్‌గా లక్ష నుంచి రూ. 1.5 లక్షల వరకు తీసుకున్నట్టు విచారణలో తెలిపారు. దీంతో వారి నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసిన వారి సమాచారాన్ని సిట్ సేకరించింది. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆది సాయిబాబు, ముడావత్ శివకుమార్, నాగార్జునసాగర్‌కు చెందిన రమావత్ మహేష్, ఖమ్మం జిల్లాకు చెందిన పొన్నం వరణ్ను సిట్ మంగళవారం అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుల సంఖ్య ఇప్పటికి 28కి చేరగా 27 మందిని అరెస్టు చేసింది. నలుగురు నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనుంది. ఇదిలాఉండగా సోమవారం అరెస్టు చేసిన మనోజ్, మురళీధర్‌కు కోర్టు రిమాండ్ విధించింది.