Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరా కేఫ్ ఆకస్మిక తనిఖీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హెదరాబాద్
'ప్రకతి, సాంప్రదాయ ఎన్నో ఔషధ గుణాలున్న నీరాపై కొందరు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా లో విషప్రచారం చేస్తున్నారు. గీత కార్మికులు ప్రాణా లకు తెగించి ప్రజల ఆరోగ్యానికి మేలుచేసే, క్యాన్సర్ తో పాటు అనేక జబ్బులను నివారించే నీరాను అంది స్తున్నారు. నీరాపై విష ప్రచారం తగదు' అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్- నెక్లెస్‌రోడ్‌లో నీరా కేఫ్‌ను మంత్రి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. స్టాళ్లలోని వంటలను రుచి చూశారు. నీరా ప్రాసిసెంగ్ యూనిట్‌ను పరిశీలించారు. నీరా కోసం వచ్చిన సందర్శకులతో మాట్లాడారు. నీరా కేఫ్‌లో ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్య ఔషధం నీరాను ప్రజలకు అందించేందుకు సుమారు రూ.20కోట్లతో ఆధునికంగా నీరాకేఫ్‌ను నిర్మించినట్టు తెలిపారు. కేఫ్‌లో నాణ్యమైన వంటకాలను ప్రజలకు అందించా లని నిర్వాహకులకు సూచించారు. నీరాను ప్రజలంద రికీ చేరేలా 'నీరా కేఫ్' ముఖ్య భూమిక పోషించేలా అధికారులు, స్టాల్ నిర్వాహకులు కృషి చేయాలని ఆదేశించారు.