Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ
- ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మెన్ సభ్యులను నియమించాలి :
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్న బీజేపీ మతోన్మాద విధానాలను ఐక్యంగా ప్రతిఘటించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్ ) రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని కేవీపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జాన్వెస్లీ మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదన్నారు. ప్రస్తుత రాజ్యాంగం స్థానంలో మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేయటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుందన్నారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల ప్రకారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్ పరం చేస్తున్న బీజేపీ విధానాలవల్ల సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతుందన్నారు. స్కైలాబ్ బాబు మాట్లాడుతూ రెండో విడత దళిత బంధును ప్రతి నియో జకవర్గంలోనూ 1500 మందికి ఇవ్వాలనీ, ఇంటి స్థలాలున్న వారికి సొంతిండ్లు నిర్మించుకోవటానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో ఎస్సీ కార్పొరేషన్ పెండింగ్ రుణాలు విడుదల చేయటం లేదని 2021 -22 పెండింగ్ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కమి షన్ చైర్మెన్ సభ్యుల నియా మకంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వానికి సూచిం చారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగా ర్జున, అతిమెల మాణిక్యం, పల్లెర్ల లలిత, దయ్యపు రాధాకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు డి రాంమూర్తి, దుర్గం దినకర్, బొట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.