Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలి :మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రెజ్లర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నియంతృత్వం తగదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి హితవు పలికారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా, మహిళా రెజ్లర్లు చేస్తు న్న పోరాటానికి మద్దతుగా, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ను అరెస్టు చేయా లని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణను నిర్వహిం చారు. ఐద్వా అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి అధ్యక్షతన కార్యక్రమంలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ కుస్తీ పోటీల్లో బంగారు పథకాలు సాధించి, దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన రెజ్లర్లపై లైంగిక దాడికి పాల్పడిన డబ్ల్యూఎఫ్‌ఎస్‌ఐ అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రెండు వారాలుగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తుంటే కేంద్రానికి పట్టదా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమాంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. జ్యోతి, బత్తుల హైమావతి, కె.ఎన్ అశలత, రాష్ట్ర సహాయకార్యదర్శులు, బుగ్గవిటి సరళ, ఎమ్ భారతి, రత్నమాల, అహల్య, బి. అనురాధ, శారద, నర్మద, రమణ, అనురాధ, శశికళ, సరోజ, తదితరులు పాల్గొన్నారు.