Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ సోమేశ్ కుమార్... సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. సోమేశ్ కుమార్ గతంలో తెలంగాణ సీఎస్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్థించింది. ఇందుకు సంబంధించి క్యాట్ ఇచ్చిన తీర్పును సైతం హైకోర్టు కొట్టేయటంతో ఆయన ఏపీకి బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత సోమేశ్... స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు అత్యంత సన్నిహితుడైన సోమేశ్ కుమార్‌కు తగు ప్రాధాన్యతనిచ్చిన సీఎం కేసీఆర్... ఆయనకు క్యాబనెట్ హోదా కలిగిన ప్రధాన సలహాదారుడి పదవిని కట్టబెట్టారు. ఈ సందర్భంగా సోమేశ్... సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.