Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 22న మెగా జాబ్ మేళా : పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో 10వేల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. 100కుపైగా పెద్ద కంపెనీలతో కుత్బుల్లాపూర్‌లో ఈనెల 22న మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేయనున్నాం' అని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ నేతత్వంలో కుత్బుల్లాపూర్‌లో నిర్వహించనున్న మెగాజాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఎమ్మెల్యే వివేకానందతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్స్టెప్ ఆధ్వర్యంలో నడుస్తున్న తొమ్మిది ఆధునిక శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణను ఇచ్చి 45వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రయివేటు రంగంలో వారి అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వివిధ రంగాలలో యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెగా జాబ్ మేళాలో ట్రాన్స్జెండర్లకు, చెవిటి, మూగ వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఏడో తరగతి నుంచి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిప్లమా హౌల్డర్స్, బీఫార్మా, ఎంఫార్మా, హౌటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, చదివినవారు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. హెచ్ఆర్ కోసం హెల్ప్ లైన్ నెంబర్ 7097655912ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.