Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో రూ.100కోట్ల ఆదాయం
- టీహబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు
- స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు సవాళ్లు: రఘుబాబు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'వ్యాపారంలో అనుసరణలు చాలా ముఖ్యమైనవి. వృద్ధి దశలో ఉన్న స్టార్టప్‌లలో చట్టాల పాలన, అమలు, అకౌంటింగ్ మరింత ముఖ్యం. ఎందుకంటే అవి పాటించకపోతే జరిమానాలు, పని ఆగిపోవడం, చట్టపరమైన కేసులు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. సింప్లీబిజ్ అందించే వృత్తిపరమైన సేవలతో టీ-హబ్‌లో ఉన్న 500కుపైగా స్టార్టప్‌లు ప్రయోజనం పొందుతాయి' అని టీ-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు తెలిపారు. గోల్కొండకోటలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో మంగళవారం రాత్రి నిర్వహించిన సింప్లీబిజ్ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
సమ్మతి, అకౌంటింగ్, టాక్సేషన్ కంపెనీలు ఎక్కువ సమయం తీసుకుంటాయని, సగటున 70శాతం సమయాన్ని పెద్ద కంపెనీలు పన్ను, అకౌంటింగ్, సమ్మతి బృందాలు వెచ్చిస్తాయని వివరించారు. వృద్ధి దశలోని స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలకు సింప్లీబిజ్ అందించే వత్తిపరమైన సేవలు ఎక్కువగా అవసరమవుతాయని తెలిపారు. సింప్లీబిజ్ వ్యవస్థాపకులు రఘుబాబు మాట్లాడుతూ వృద్ధి బాటలో ఉన్న స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు భారతదేశం వెలుపల ఉన్న విదేశీ ఎస్ఎంబీలు నిర్వహించనున్న సేవల కోసం విశ్వసనీయ భాగస్వాములను కనుగొనడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. నేటి ఎస్ఎంబీలు రేపటి ఎంఎన్సీలని అన్నారు.
ప్రస్తుతం, ఎంటీటీ మేనేజ్మెంట్ స్పేస్‌లోని ప్రొఫెషనల్ సర్వీస్ అందించే కొన్ని పెద్ద సంస్థలు ఉండగా, చిన్న సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, అవి అసంఘటితంగా ఉంటున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అకౌంటింగ్, ట్యాక్స్, లీగల్, పేరోల్, లావాదేవీ సలహా సంస్థల మేనేజ్మెంట్ స్పేస్‌లో ప్రారంభ దశ, వద్ధిదశలో ఉన్న కంపెనీలకు విశ్వసనీయ భాగస్వామిగా మారడంతో వచ్చే ఐదేండ్లలో రూ.100 కోట్ల ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రణాళికలు రచించినట్టు తెలిపారు.