Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జాతీయ గ్రామీణ ఉపాధి చట్ట రక్షణ కోసం ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్వహించబోతున్నట్టు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు 100 రోజులు పనిని గ్యారెంటీ చేస్తూ యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిని ఎత్తివేయడం కోసం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బడ్జెట్లో భారీగా నిధులు తగ్గించారనీ, కూలీలను తగ్గించడం కోసం అనేక రకాల నిబంధనలను తీసుకొస్తున్నారని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాలని చెప్తున్నా పాలకులు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. పనిముట్లు ఇవ్వకుండా కూలీలు ఏ విధంగా పనిచేస్తారని ప్రశ్నించారు. వేతనాల పే స్లిప్పులను ఇవ్వకుండా నిలిపేశారని తెలిపారు. ఐదు కి.మీ దాటిన పని ప్రదేశానికి వెళ్లి రావడానికి లోకల్ ఆటో ఛార్జీలు ఇచ్చే పద్ధతిని రద్దు చేశారని విమర్శించారు. కూలీలు తమంతట తామే పనికి దూరమయ్యే విధంగా కొత్త పద్ధతులను తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాన్ని చేపడు తున్నామని చెప్పారు. కూలీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఆర్ వెంకట్రాములతోపాటు వివిధ సంఘాల నాయకులు బి. ప్రసాద్, బి. పద్మ, రాష్ట్ర అధ్యక్షులు కె. కాంతయ్య బీకేఎంయూ ఎస్. శివలింగం, పీఎంసీ రాష్ట్ర కన్వీనర్ జి. సరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దళిత బహుజన శ్రామిక యూనియన్ పులి కల్పన డి బిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే కష్ణవేణి ఏ ఎం సి రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ పాల్గొన్నారు.