Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీజూడా వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
2020 బ్యాచ్‌కు చెందిన పీజీ విద్యార్థులు ఎండీ, ఎంఎస్ డిగ్రీ, డిప్లమో పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) కోరింది. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.కె.అఖిల్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మే 2న ఒక వినతి పత్రా న్ని యూనివర్సిటీలో సమర్పించినప్పటికీ స్పందన లేదని తెలిపారు. యూ నివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డిని కలిసేందుకు జూడా నాయకులు ప్రయత్నించి నప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవే దన వ్యక్తం చేశారు. 2020 బ్యాచ్‌కు సంబంధించి మూడు సంవత్సరాల పీజీ ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ముగుస్తుందనీ, ముందుగానే పరీక్ష లు నిర్వహిస్తే ఎక్కువ మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాద ముందని వారు పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా పీజీ కరికులంలో అంతరాయం ఏర్పడిందనీ, విద్యాసంవత్సరం పట్టించుకోకుండా ఆ సమయంలో పీజీలు విధులు నిర్వర్తించారని గుర్తుచేశారు.
దాదాపు రెండేండ్లు రెండు బ్యాచ్‌లు కోవిడ్ విధులు చేశాయని తెలిపారు. నీట్ ఎస్ఎస్ పరీక్షల ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నందున పీజీ పరీక్షలను మరో 15 నుంచి 30 రోజులు పొడిగిస్తే దానికి అర్హత సాధించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండ దని స్పష్టం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో విద్యా సంవత్స రంలో అంతరాయాన్ని ఎదుర్కొన్న విషయాన్ని గమనంలోకి తీసుకుని పలు రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయనీ, విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారని వారు తెలిపారు.