Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో మళ్లీ మాకే అధికారం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాయలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేపీఎస్లది న్యాయబద్దమైన డిమాండ్ అని అన్నారు. ప్రభుత్వం బెదిరించినా అదరకుండా ఉద్యమం చేస్తున్న వాళ్లకు హ్యాట్సాఫ్ చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకున్నోళ్లని, ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయినా వారిని ఎందుకు రెగ్యులరైజ్ చేయడంలేదని ప్రశ్నించారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన వ్యక్తిని సీఎం తన ప్రధాన సలహాదారునిగా నియమించుకోడం శోచనీయమని అన్నారు. కర్ణాటకలో మళ్లీ బీజేపీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఫెయిలయ్యామనే భావనతో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని, సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు. అంతకుముందు ఉమ్మడి మెదక్ జిల్లా పోలింగ్ బూత్ కార్యకర్తలతో సంజరు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ నిర్వహించే 'నిరుద్యోగ మార్చ్'తో సీఎం కుటుంబానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే 'నిరుద్యోగ మార్చ్' ద్వారా గర్జించాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో నిరుద్యోగులతో నిర్వహించే 'మిలియన్ మార్చ్'తొ గడీలు బద్దలు కావాలని అన్నారు.