Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థ విజయభేరి మోగించింది. 1,048 మంది విద్యార్థులు పదికి పది జీపీఏను సాధించారని శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ చెప్పారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 9.8 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు 2,057 మంది, 9.5 జీపీఏ ఆపైన సాధించిన వారు 3,788 మంది ఉన్నారని వివరించారు. తమ విద్యాసంస్థలో 98.4 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వంద శాతం ఉతీర్ణత పొందిన తమ బ్రాంచ్లు 63 ఉన్నాయని అన్నారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 11,168 మంది పది పాయింట్లను సాధించారని వివరించారు. ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ మెథడాలజీ, సీ ఐపీఎల్, ఎంపీఎల్, ఐకాన్, సీబ్యాచ్, సివిల్స్, మెడికాన్, టెక్నో వంటి పటిష్టమైన అకడమిక్ ప్రోగ్రామ్లు, మైక్రోస్థాయి బోధనతోపాటు అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు.