Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- తునికి ఆకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో..
- విప్ రేగా.. ఎమ్మెల్యే పొదెం.. మధ్య వాగ్వివాదం
- సముదాయించిన ఎస్పీ వినీత్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో తునికి ఆకు బోనస్ చెక్కుల పంపిణీ సభ సాక్షిగా ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు బాహా బాహీకి దిగారు. వారి హోదాను మరిచి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకరిపై ఒకరు అగ్రహావేశాలు వ్యక్తపరుచుకున్నారు. పరిస్థితి గమనించిన ఎస్పీ వినీత్ వారి వద్దకు వెళ్లి సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. ఆ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తల్లో సైతం నేతల మధ్య వాగ్వివాదంతో కొంత గందరగోళం ఏర్పడింది. బుధవారం దుమ్ముగూడెం మండల కేంద్రంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేట్టారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతున్న సమయంలో పొదెం వీరయ్య జోక్యం చేసుకుని 'మంత్రిగారికి అవకాశం ఇవ్యు' అంటూ చెప్పడంతో తమ ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నా.. నీకేంటి అభ్యంతరం అని రేగా కాంతారావు చెప్పడంతో.. వారిద్దరు ఒక్క సారిగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఇద్దరి మధ్య ఆవేశాలు కట్టలు తెంచుకోవడంలో అక్కడే ఉన్న ఎస్పీ ఇద్దరినీ సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తునికి ఆకు సేకరణ అమ్మకం ద్వారా 2016 నుంచి 2022 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 290 కోట్లు కార్మికులకు బోనస్ రూపంలో అందజేశామన్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం రూ.77 కోట్లు విడుదల కాగా భద్రాచలం డివిజన్లోని చర్ల, దుమ్ముగూడెం మండలాలకు రూ.27,56,23,000 కార్మికులకు బోనస్ రూపంలో చెల్లించామన్నారు.. అటవీ క్షేత్రాలను సురక్షితంగా ఉంచడం ద్వారానే గిరిజనులకు అడవుల నుంచి ఫల సాయాలు అందుతాయని, దాని ద్వారా ఆర్థికంగా అభివృద్ది చెందుతారని తెలిపారు. గతంలో తునికి ఆకు 50 ఆకుల కట్టకు రూ.2 మాత్రమే చెల్లించేవారని, ఇప్పుడు 50 ఆకుల కట్టకు రూ.3లకు పెంచామన్నారు.