Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- అవసరమైన భద్రత కల్పించాలి : ఐఎంఏ, టీజూడా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్‌లో నెఫ్రాలజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై రోగి బంధువులు చేసిన దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) తదితర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు గురువారం ఆయా సంఘాలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. రోగి పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌పై 10 నుంచి 12 మంది అసాంఘిక శక్తుల తీరులో దాడి చేయడమే కాకుండా వేరే రోగికి సీపీఆర్ చేయడాన్ని అడ్డుకున్నారని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బీ.ఎన్.రావు, గౌరవ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జె.విజరు రావు తెలిపారు. వారిపై చర్యలు తీసు కోవాలనీ, ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రత్యేక భద్రతను కల్పించాలనీ, ప్రోటోకాల్స్ అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి వెంటనే భద్రత కల్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని టీజూడా అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ కుమార్ పింజరాల డిమాండ్ చేశారు.
వీసీ తీరుపై డాక్టర్ల సంఘాల ఆగ్రహం
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తీరుపై డాక్టర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 2020 బ్యాచ్ పీజీ మెడికల్ విద్యార్థుల పరీక్షలను వాయిదా వేయాలని ఈ సందర్భంగా టీజూడా డిమాండ్ చేసింది.ఈ మేరకు టీజూడా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు లేఖ రాశారు. పరీక్షలకు గడువు ఉన్నప్పటికీ చదువుకునేందుకు వెసులుబాటు కల్పించకుండా వీసీ హడావుడి చేస్తు న్నారని తెలిపారు. సమస్యలపై కలిసి చర్చించేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెబుతున్న వీసీ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను ఏర్పాటు చేసుకోవాలని హెచ్ఓడీలను కోరినట్టు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఎం.రాజీవ్ తెలి పారు. వీసీ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్నారనీ, అవినీతిపరుడంటూ హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కె.మహేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు మెడి కల్ కాలేజీల ప్రయోజనాల కోసం మాత్రమే డాక్టర్ కరుణాకర్ రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు.