Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వైద్యుని నిర్లక్ష్యం వల్లే రోగి మృతిచెందిందంటూ బాధిత కుటుంబీకు లు హైదరాబాద్ నిమ్స్‌లో వైద్యునిపై దాడికి దిగారు. వివరాలిలా ఉన్నా యి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్‌కు చెందిన వెంకటలక్ష్మి(62) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడింది. ఆమెను పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి తీసుకురాగా సీరియస్‌గా ఉందని ఆర్ఐసీయూకు తరలించారు. గురువారం ఉదయం ఆమె పరిస్థితి విషమించి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని ఆరోపిస్తూ బంధువులు నెఫ్రాలజీ విభాగానికి చెందిన రెసిడెంట్ వైద్యుడు రాహుల్‌పై దాడి చేశారు. అనంతరం ఇరువర్గాల వారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.