Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ చెబుతున్న కిసాన్ సర్కార్ నినాదం పచ్చి మోసపూరితమని బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్టకొట్టడమేనా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విడదీయలేని బంధం ఉందని తెలిపారు. అమిత్ షా ఆదేశాలతో గుజరాత్‌కి చెందిన అమూల్ పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఇదే కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఉన్న నందిని పాల కంపెనీని మూసియాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగ బడ్డారని గుర్తుచేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం గజ్వేల్‌లోని వర్గల్లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయటానికి ఎర్రతివాచీ పరిచి ఆహ్వా నించిందని పేర్కొన్నారు. విజయ పాల కంపెనీకి ప్రభుత్వం రెండేండ్లుగా ఎమ్‌డీని కూడా ఎందుకు నియమించలేదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీ లాభాల కోసం బీఎస్ఎన్ఎల్ కంపె నీని చంపినట్టే, రాష్ట్ర ప్రభుత్వం విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీ లను చంపి,అమూల్ కంపెనీకి కట్టబెడుతున్నారని విమర్శించారు. కవిత ను ఈడీ విచారణ నుంచి కాపాడటానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు ప్రజలముందు డ్రామాలు చేస్తూ.. తెరవెనక బీజేపీతో దోస్తీ చేస్తున్నారన్నారని తెలిపారు.