Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అడిక్‌మెట్
హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్‌ను విక్రయిస్తున్న నైజీరియన్ దేశానికి చెందిన వ్యక్తిని గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం..నైజీరియన్ దేశానికి చెందిన అగోడికే న్నామెకా అలియాస్ మైఖేల్ ఎబెరే బెంగళూరులో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, అతను హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద గురువారం మధ్యాహ్నం నార్కోటిక్ ఎండీఎంఏ డ్రగ్ విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు అక్కడకు చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి 11 గ్రాముల డ్రగ్స్‌ను, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.