Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి :సీపీఐ(ఎం.ఎల్) ఆర్.ఐ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం.ఎల్) ఆర్.ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గడ్డం సదానందం ఒక ప్రకటన విడుదల చేశారు. రెజ్లర్ల డిమాం డ్లను వెంటనే నెరవేర్చాలని కోరారు. దేశ ప్రతిష్టను ఇనుమడింప జేసిన వారు వారాల తరబడి ధర్నాలు చేసినా కేంద్రం స్పందించక పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భరోసా కల్పించక పోగా మహిళా మల్ల యోధులను బెదిరించారనీ, వేధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.