Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
- బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా శుక్రవారం నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలపాలని రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. లైంగిక వేధింపులకు కారకులైన బీజేపీ ఎంపీ బ్రిజేష్ భూషణ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఎస్కేఎం కేంద్రకమిటీ పిలుపులో భాగంగా జిల్లా, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేయాలని కోరింది. గురువారం ఈమేరకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్్కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్యపద్మ, పి.ప్రభాకర్, పెద్దారపు రమేష్, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, మామిడాల భిక్షపతి ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసు కోవాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారని గుర్తు చేశారు. ఆయనపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో మూడు మాసాల తర్వాత రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీ యంగా ఎన్నో పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చి పెడుతున్న ఒలింపిక్ పతక విజేతలతోసహా మన అగ్రశ్రేణి క్రీడాకారులు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నా...కేంద్ర సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పర్యవేక్షక కమిటి ఫలితాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. నిందితులపై ఫోక్సో చట్టంతోపాటు కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.