Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సెట్విన్ ఆధ్వర్యంలో జంట నగరాల్లో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సుల్లో 15ఏండ్లు పూర్తయిన వాటిని తొలగించి వాటిస్థానంలో దశలవారీగా కొత్త బస్సులను ప్రవేశపెట్టను న్నట్టు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన గోల్కొండ నుంచి చార్మినార్ రూట్లలో ఒక బస్సు, సికింద్రాబాద్ మెహిదీపట్నం రూట్లలో మరో బస్సును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెట్విన్ అధ్వర్యంలో జంట నగరాల్లో 100 మినీ బస్సులను నడుపుతున్నామని, వాటిని దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి వీలుగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, సెట్విన్ ఆధ్వర్యంలో వత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని వివరించారు. సెట్విన్ బస్సు ఆపరేటర్లు ప్రయాణికులతో సత్సంబంధాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని కోరారు.
బస్సులను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాల ని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణు గోపాలరావు, మేనేజర్ ఎంఏ.మోయిజ్, సెట్విన్ మినీబస్సుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శేఖర్‌రెడ్డి, అలీ షేర్‌ఖాన్, నాయకులు డి సుదర్శన్‌రెడ్డి, హసన్అలీ, అబ్దుల్లాభారు తదితరులు పాల్గొన్నారు.