Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నర్సుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్ఎస్) డిమాండ్ చేసింది. శుక్రవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ధనుంజరు కంపాటి, వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్ ఒక ప్రకటన విడుదల చేశారు. నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తెలిపారు. నర్సుల హౌదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ ఆఫీసర్‌గా మార్చడం వల్ల ప్రభుత్వంపై పైసా భారం పడబోదని, అయినా వారి హౌదాను పెంచడం లేదని వాపోయారు. వైద్య నియామక మండలిలో నర్సులకు ప్రాతినిథ్యం లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 2014 నుంచి నర్సింగ్ కౌన్సిల్‌కు ఒక్కరే రిజిస్ట్రార్‌గా కొనసాగడం, కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రయివేటు రంగంలో పని చేసే నర్సులకు రూ.26,000 కనీస వేతనాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రయివేటు, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసే సీనియర్ నర్సులకు ఏడాదికి ఒక మార్కు వెయిటేజీ అనే పద్ధతిని రద్దు చేయడంతో 35 వేల మందికి అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నియమాల ప్రకారం మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులను నర్సులతో భర్తీ చేయాలనీ, ఆ నియమానికి భిన్నంగావాటిని బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ బీ.యస్సీ (నర్సింగ్) కళాశాలల్లో పురుషులకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.