Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి స్పటికలింగం, నవగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్టు శ్రీ మహాగణపతి, శ్రీపోచమ్మ దేవాలయాల ట్రస్ట్ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్-4లోని ట్రస్ట్ దేవాలయ పునర్మిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గం. 6-57 నిముషాలకు శ్రీ మహాగణపతి పున్ణ ప్రతిష్ట, శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి, నవగ్రహ దేవతామూర్తుల ప్రతిష్టను నిర్వహిస్తున్నారు. 2009లో నిర్మించిన ఈ ఆలయానికి విశేష పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఇక్కడి మహా గణపతి పది భుజాలు, తలపై చంద్రవంక, త్రినేత్రంతో మాతా శక్తిని తొడపై కూర్చోబెట్టుకొని ఉండటం ఈ దేవాలయ విశేషం. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని ట్రస్టు సభ్యులు గురువారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి పున్ణప్రతిష్ఠ, నూతనంగా శ్రీకాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి స్ఫటిక లింగం, నందీశ్వర, కుమారస్వామి, వీరభద్రస్వామి, అభయాంజనేయ స్వామి, కాల భైరవ స్వామి, నవగ్రహాలతో పాటు శ్రీ పోచమ్మ వారి ఆలయ శిఖరముల త్రయాహ్నికా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ట్రస్టు చైర్మెన్, సభ్యులు విజ్ఞప్తి చేశారు.