Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,069 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 22న నియామక ఉత్తర్వుల అందజేత : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ర్యాగింగ్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. 1,069 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ నెల 22న నియామక పత్రాలను అందజేయనున్నట్టు తెలిపారు. బోధనాస్పత్రుల పనితీరుపై గురువారం ఆయన నెలవారీ సమీక్షా సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఏడాది ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 65 మందికి ప్రొఫెసర్లు, 210 అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. 800 మంది పీజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, వైద్య విధాన పరిషత్ ప్రధాన ఆస్పత్రులకు కేటాయించామని వివరించారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలు నడిచేలా చూడాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.