Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైన, వీణవంకలో 44.3 డిగ్రీల ఎండ
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
- ఒకటెండ్రు రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నది. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం జగి త్యాల జిల్లా జైనలో, కరీంనగర్ జిల్లా వీణ వంకలో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యా యి. ఈ ఏడాది మే నెల లో ఇదే అత్యధిక ఉష్ణో గ్రత. వచ్చే రెండ్రోజుల్లో రోజువారీ కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపి స్తున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దయ్యే అవకాశం ఉంది. జగిత్యాల, మంచిర్యాల, నల్లగొండ, ఖమ్మం, పెద్ద పల్లి, సూర్యాపేట జిల్లాల ను టీఎస్‌డీపీఎస్ రెడ్ జోన్లో చేర్చింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 43 డిగ్రీలు దాటే అవకాశమున్న నేపథ్యంలో ఆ జిల్లాలూ ఆరెంజ్ హెచ్చరికల జాబితాలో చేరాయి.
అయితే, హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడొచ్చు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మోచా తుఫాన్‌గా మారింది. ఉత్తర- వాయువ్యదిశలో ప్రయాణిస్తూ అది కాస్తా తీవ్ర తుఫాన్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో ఆ తుఫాన్ మరింత బలపడి ఆగేయ బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ మధ్యలోని సిట్ట్వె సమీప ప్రాంతంలో తీరం దాటే అవకాశముంది. ఆ సమయంలో గంటకు 140 నుంచి 150 కిలోమీటర్ల గాలులు వీయొచ్చు. దీని ప్రభావం వల్ల రాష్ట్ర ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు.
జైన (జగిత్యాల) 44.3 డిగ్రీలు
వీణవంక (కరీంనగర్) 44.3 డిగ్రీలు
తాడిచర్ల (భూపాలపల్లి) 44.1 డిగ్రీలు
ముత్తారం (పెద్దపల్లి) 43.8 డిగ్రీలు
చాప్రాల (ఆదిలాబాద్) 43.3 డిగ్రీలు