Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్యపన్నుల శాఖ సమీక్షాసమావేశంలో సీఎస్ శాంతికుమారి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పన్ను వసూళ్లలో అసాధారణ పనితీరు కనబర్చినందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. పన్ను ఎగవేతపై దష్టి సారించడం ద్వారా ఈ ఏడాది రూ.85,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా తమ ప్రయత్నాలను విస్తరించాలని ఆమె అధికారులను కోరారు. వాణిజ్య పన్నుల శాఖలోని సీనియర్ అధికారులతో గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించి, అదనపు వనరులను పెంపొందించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకొచ్చిన శాఖ ఉన్నతాధికారులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. పన్ను ఆదాయాన్ని పెంచడం కోసం సామర్థ్యాలను పెంపొందించుకోవాలని అధికారులను కోరారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడంతోపాటు ఎగవేతలను తగ్గించేందుకు కషి చేయాలని అన్నారు. అపిలేట్ జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించాలని ఆమె కమిషనర్‌ను ఆదేశించారు. ఆదాయం ఎక్కువగా సమకూరే ప్రాంతాలను మ్యాప్ చేసి, క్రమపద్ధతిలో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని పెంచేందు కోసం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌ను బలోపేతం చేయడం, స్వచ్ఛ ంద సమ్మతిని ప్రోత్సహించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీతూకుమారి ప్రసాద్, అదనపు కమిషనర్లు సాయికిషోర్, హరిత, జాయింట్ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.