Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భావి తరాలకు అందించాలి
- పరిశోధన పుస్తకాల ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. పరిశోధకుల బృందం ఈ ప్రాంతంలోని చరిత్రపై లోతైన అధ్యాయనం చేయాలి. చరిత్రను భవిష్యత్ తరాలకు పుస్తకాల రూపంలో అందించాలి. వాటిని భద్రపరచాలి. పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని చరిత్ర పరిశోధకుల కషి అభినందనీయం' అని పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో చరిత్ర పరిశోధకులు రామోజు హరగోపాల్ రచించిన తొలత తెలుగు రాతిరాత 'తోలుచు వ్రాన్డ్రు', 'తెలంగాణ చరిత్ర తొవ్వలో' అను రెండు చరిత్ర పరిశోధనా పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సూచనల మేరకు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారసత్వ, చారిత్రాత్మక, సమగ్ర చరిత్రను పరిశోధకులు భవిష్యత్తు తరాలకు అందించేందుకు పుస్తకాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తున్నామని అన్నారు. పరిశోధకుల బృందం తెలంగాణ ప్రాంతంలోని చరిత్రపై లోతైన అధ్యాయనం చేయాలని కోరారు. మరుగున పడిన అసలైన చరిత్రను బయటకు తీసేందుకు సమగ్ర చరిత్రపై మరిన్ని పరిశోధాత్మక పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకుల బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్టలో జరిపిన పరిశోధనలో వెలుగు చూసిన తొలుచు వ్రాన్డ్రు శాసనాన్నే తొలి తెలుగు రాతిరాత శాసనంగా గుర్తించడం సంతోషంగా ఉందని తెలిపారు. చరిత్ర పరిశోధకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమగ్ర చరిత్రను వెలికి తీయడానికి వీలుగా ప్రభుత్వం తరుపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. చారిత్రక పరిశోధక పుస్తకాలను రచించిన రామోజు హరగోపాల్, ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిలను మంత్రి ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివద్ధి సంస్థ ఓఎస్డీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.