Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం ఆనర్స్, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్‌ను గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. ఉస్మా నియా విశ్వ విద్యాలయం (ఓయూ), కాకతీయ విశ్వ విద్యాలయం (కేయూ), తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ), మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎం జీయూ), పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ), శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ), తెలం గాణ మహిళా విశ్వవిద్యాలయం (టీడబ్ల్యూ యూ) పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు డిగ్రీ కాలేజీ ల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటర్మీ డియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువున్నది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, టి వ్యాలెట్, బిల్ డెస్క్, ఆటం టెక్నాల జీస్, భారత్ పే ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లిం చాల్సి ఉం టుంది. ఈనెల 20 నుంచి వచ్చేనెల 11వ తేదీ వరకు వెబ్ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశ మున్నది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన వచ్చేనెల ఎనిమిది, తొమ్మిది తేదీల్లో విశ్వ విద్యాలయాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల్లో చేపడతారు. వచ్చేనెల 16వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థులు పూర్తి వివ రాలకు వెబ్ సైట్ ను సంప్రదించాలి. ఈ ఏడాది రిజిస్ట్రేషన్లకు విద్యార్థుల కోసం ప్రత్యే కంగా దోస్త్ యాప్‌ను అందు బాటులోకి తెస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కళాశాల విద్యాశాఖ జేడీ డిఎస్ ఆర్ రాజేందర్‌సింగ్, ఆర్జేడీ జి యాదగిరి, అకడమిక్ గైడెన్స్ అధికారి డి తిరు వెంగళచారి, ఐసీటీ అధికారి యమునారాణి, దోస్త్ హెల్ప్‌డెస్క్ కోఆర్డినేటర్ విజ యరెడ్డి, రూసా రీసెర్చ్ అధికారి డి వసుంధర, సీజీజీ ప్రాజెక్ట్ మేనేజర్ పి హేమంత్ పాల్గొన్నారు.
40 హెల్ప్‌లైన్ కేంద్రాలు
డిగ్రీ ప్రవేశాల కోసం మూడు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 40 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఒకటి, విశ్వవిద్యాల యాల పరిధిలో ఆరు, జిల్లా కేంద్రాల్లో 33 చొప్పున మొత్తం 40 హెల్ప్‌లైన్ కేంద్రాలున్నాయి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ఆధారంగా విద్యార్థులు దోస్త్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దోస్త్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసు కోవచ్చు. మీసేవా/ఆన్లైన్ కేంద్రాల ద్వారా విద్యార్థు లు బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. తెలంగాణలో ఇంటర్ చదివిన విద్యార్థులు టీయాప్ ఫోలియో మొబైల్ యాప్ ద్వారా దోస్త్‌లో నమోదు చేసుకునేం దుకు అవకాశమున్నది. ప్రభుత్వ, విశ్వవిద్యాలయ కాలేజీల్లో సీట్లు పొంది ఈపాస్ ద్వారా ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న వారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయివేటు కాలేజీల్లో సీట్లు పొంది ఈపాస్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యా ర్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు రూ.వెయ్యి చెల్లించాలి. రిజర్వేషన్ల కింద సీట్ల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన మీసేవా కులధ్రువీకరణ పత్రం నమోదు చేయడం తప్పనిసరి. 2022, ఏప్రిల్ ఒకటి తర్వాత తీసుకున్న ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎన్సీసీ, అదనపు కరిక్యులర్ యాక్టివిటీస్, వికలాంగులు, సీఏపీ ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి.
దేశానికే మోడల్ దోస్త్ : లింబాద్రి, నవీన్ మిట్టల్
దేశానికే మోడల్‌గా దోస్త్ ఉన్నదని ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ఆన్లైన్లో డిగ్రీ ప్రవేశాల విధానం ఆదర్శవంతంగా కొనసాగుతున్నదని అన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ విధానాన్ని పరిశీలించి అమలు చేస్తున్నాయని వివరించారు. 2019లో ప్రభుత్వ, 2020లో ప్రయివేటు కాలేజీల్లో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయని చెప్పారు. ఆప్షన్లు ఎక్కువ ఇచ్చేందుకు అవకాశమొచ్చిందన్నారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో 11 ఉన్న ఆప్షన్ల నుంచి 50కిపైగా పెరిగాయని వివరించారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. ఈ ఏడాది కొత్తగా స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులను ప్రారంభిస్తున్నామని చెప్పారు. బీబీఏ లాజిస్టిక్స్, బీఎస్సీ యానిమేషన్ వంటి కోర్సులుంటా యని అన్నారు. బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నామని వివరించారు. మూడేండ్లు చదివితే బీఎస్సీ డిగ్రీ, నాలుగేండ్లు చది వితే బీఎస్సీ ఆనర్స్ ధ్రువపత్రం ఇస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరంలో 11 ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంద న్నారు. ఆ కోర్సు ఫీజుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ విద్యార్థుల కోసం పరిశ్రమల వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. దోస్త్ పరిధిలోకి హోటల్ మేనేజ్మెంట్ కోర్సును తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.