Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భర్తీ చేయనున్న 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియలో భాగంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 15, 16న మల్టీ జోన్ -1 అభ్యర్థులకు, 17, 18న మల్టీ జోన్ -2 అభ్యర్థులకు, 19న మల్టీ జోన్ 1,2 సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు కోఠిలోని డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరగనున్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం డీఎంఈ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.